కామారెడ్డి జిల్లా సారంపల్లి గురుకుల పాఠశాల వద్ద బిఆర్ఎస్వి నాయకుల అడ్డగింత
నిరసన వ్యక్తం చేసిన బిఆర్ఎస్వి నాయకులు
కామారెడ్డి (విజయక్రాంతి): బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం కామారెడ్డి జిల్లాలో బిఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆరో వార్డు సారంపల్లి వద్దగల గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల, కళాశాలను సందర్శించేందుకు వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు గురుకులంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసుల చేత ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు.
విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని మెన్ ప్రకారం భోజనాలు పెట్టడం లేదని బిఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. పోలీసులు అడ్డుకోవడంతో గురుకుల పాఠశాలలోకి వెళ్లకుండా విద్యార్థి సంఘ నాయకులు వేణు దిరిగారు.