నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం సంక్రాంతి పండుగను పురష్కరించుకోని మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామల్లో నిర్వహిస్తున్న నాను మహారాజ్ జాతరలో కొందరు పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు గురువారం నిర్మల్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. జాతర నిర్వహించే ప్రదేశాల్లో పంటపోలాలు, వాగుల్లో పేకాట శిభిరాలు ఏర్పాటు చేసుకొని భయల దుఖాణంలోపల పేకాట ఆడుతున్న స్థావరాలను గుర్తించారు. నిర్మల్ ఏఎస్పీ రాకేష్ మీనా ఆధ్వర్యంలో పోలీసులు స్థావరాల వద్దకు చేరుకోవడంతో నిర్వహాకులు వదిలిపెట్టి పారిపోయారు. పేకాట అడుతున్న వారు సైతం పంట పోలాల నుండి పరుగులు పెట్టారు. కొందరిని అదుపులో తీసుకొని సారంగ పూర్ పోలీస్ స్టేషన్ తరలించినట్టు పోలీసులు తెలిపారు. జాతరలో ఆంధ్ర తరహాలో పేకాట నిర్వహించడం చట్ట వ్యతిరేకమని వారు నిర్వహాకులను హెచ్చరించారు. మహారాష్ట్ర నుండి వచ్చిన వారు ఈ శిబిరాలను నిర్వహించినట్టు వారు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ట పోలీసులు ఉన్నారు.