calender_icon.png 17 April, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిసెల తొలగింపుకు పోలీసుల యత్నం

15-04-2025 01:46:11 PM

ప్రతిఘటిస్తున్న గుడిసె వాసులు

మానుకోటలో తీవ్ర ఉద్రిక్తత 

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలోని కురవి గేట్ సమీపంలో 255/1 సర్వే నంబర్ భూమిలో గత కొంతకాలంగా సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారిని అక్కడి నుంచి తొలగించేందుకు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో పోలీసులు చేరుకున్నారు. అయితే గుడిసె వాసులతో పాటు సిపిఎం నాయకులు అక్కడికి చేరుకొని పోలీసుల తీరును తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు.

పలుమార్లు ప్రభుత్వ భూమి అంటూ గుడిసె వాసులను అక్కడి నుంచి తరిమి వేయడానికి గత బిఆర్ ఎస్ ప్రభుత్వం(BRS Govt) కుట్ర చేసిందని, 200 మంది పై కేసులు పెట్టిన బెదరకుండా అక్కడే నివాసం ఉంటున్నారని, పేదలకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గుడిసెల తొలగింపుకు రావడం ఏమిటని సిపిఎం నాయకులు బానోతు సీతారాం నాయక్, తోట శ్రీనివాస్, బానోత్ వెంకన్న, ఎండి రజాక్, మందుల మహేందర్ ఆధ్వర్యంలో గుడిసె వాసులతో కలిసి పోలీసులు అధికారులను గుడిసె తొలగించకుండా ప్రతిఘటించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పెట్రోల్ బాటిల్లతో అధికారులకు అడ్డు తగిలారు. దీనితో పోలీసులు అధికారులు కొంత వెనక్కి తగ్గారు. అయితే కొన్ని గంటల తర్వాత మళ్లీ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో గుడిసె వాసుల మధ్య పోలీసు, అధికారుల మధ్య కథన రంగాన్ని తలపిస్తోంది. చావనైనా చస్తాం.. భూమి వదిలి వెళ్ళేది లేదంటూ పేదలు భీష్మిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.