calender_icon.png 7 January, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసులు దాడి

05-01-2025 07:43:04 PM

మణుగూరు (విజయక్రాంతి): పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న ఆరుగురుని అరెస్టు చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మండలం చెరువు సింగారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. బూర్గంపాడు ఎస్‌ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పేకాట ఆడుతున్న సమాచారంతో స్టేషన్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. నిందితుల నుంచి రూ.18,050 నగదు,మూడు బైకులు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ ఆడుతూ.. యువత భవిష్యత్తు జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. పేకాటలో ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు. మండలంలోని గ్రామాలలో బెట్టింగ్, పేకాటలకు పాల్పడితే.. వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు.