8మంది వ్యక్తులతో పాటు రూ 19100 నగదు,8 మొబైల్ ఫోన్లు, 7 బైకులు స్వాధీనం
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని బుగ్గ అటవీ ప్రాంతం సమీపంలో గల మామిడి తోటల్లో కొనసాగుతున్న పేకాట స్థావరంపై గురువారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ సీఐ రాజకుమార్, ఎస్సై లచ్చన్న తోపాటు సిబ్బంది దాడి చేసి మామిడి తోటల్లో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తుల నుండి రూ 19100 నగదు తో పాటు 8 మొబైల్ ఫోన్లు, 7 బైకులు, ప్లేయింగ్ కార్డ్స్ లను స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ వారిలో తొంగల వెంకటేష్ (సింగరేణి ఉద్యోగి, కన్నాల గేట్), చింతల రాజేందర్ (బెల్లంపల్లి గంగారాంనగర్), ఉపేందర్ (బెల్లంపల్లి), ఎండి హకీం (తాండూర్, సుభద్ర కాలనీ), ఎస్ డి ఉస్మాన్ (బెల్లంపల్లి), మాచర్ల గట్టయ్య (బెల్లంపల్లి గాంధీనగర్), నాగనవేని నరేష్ (బెల్లంపల్లి గాంధీనగర్), శ్రీను (బెల్లంపల్లి కన్నాల గేట్) లో ఉన్నారు. పట్టుబడ్డ వ్యక్తులతో పాటు నగదు,మొబైల్ ఫోన్లు, బైక్ లను తాళ్ల గురిజాల ఎస్సై రమేష్ కు అప్పగించారు. వీరిపై తాళ్ల గురిజాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.