calender_icon.png 8 February, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు క్రీడాకారులు ఉత్సాహంతో పని చేయాలి

08-02-2025 12:41:53 AM

జిల్లా ఎస్పీ సిందూ శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి):  పోలీసులు రెట్టింపు ఉత్సవంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ సిబ్బంది క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించిన వారిని ఎస్పీ సింధు శర్మ సన్మానించారు.

కరీంనగర్లో జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు జరిగిన  3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోరట్స్ మీట్-2025   క్రీడల్లో జిల్లాకి చెందిన పోలీస్ క్రీడాకారులు 02  బంగారు పతకాలు, 05 -రజత, 03-కాంస్యం పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధిం చారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సింధు శర్మ జిల్లా, జోనల్ స్థాయిలో ఉత్తిమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించినందుకు క్రీడాకారులకు అభినందనలు తేలియజేసి బహుమాతులు అందజేశారు.ఇదే స్పూర్తిని  కనబరుస్తూ రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పథకాలు సాధించిన పదిమంది పోలీస్ సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పి యాకూబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు  సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ  పతకాలు సాధించిన క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.