హైదరాబాద్: సచివాలయం ముట్టడికి ప్రయత్నించిన నిరుద్యోగులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ సెక్రటేరియట్‌ను ముట్టడించిన బీ.సీ జనసభ అధ్యక్షుడు, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు రాజారాం యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీ.సి కులగణన వెంటనే చేపట్టాలి, స్థానిక సంస్థల్లో బీ.సీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీ.సీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు యాదవ్ డిమాండ్ చేశారు. డీఎస్సీ వాయిదా వేయాలి, గ్రూప్-2 పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని ఈరోజు హైదరాబాద్‌లోని సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునివ్వడంతో సెక్రటేరియట్ వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.