8700 నగదు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని పాత బస్టాండ్ రాజీవ్ నగర్ లో ఇంట్లో బుధవారం రాత్రి పేకాట ఆడుతున్నారని రామగుండం టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, పట్టణ పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడి చేసి ఇంటి యజమానితో పాటు 7 గురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుండి రూ.8700 నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఇంటి యజమాని బొరిగం వెంకటేశ్వర్లు, రాచర్ల అనిల్ కుమార్, రాకం సంతోష్, కల్కోటి శంకర్, రాచర్ల రవికుమార్, జక్కని సత్యం, ఈగ రవి కిరణ్, ఎర్రం రాజన్నలు ఉన్నారు. ఈ సందర్బంగా పట్టణ ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పట్టణం, గ్రామాలలోని బహిరంగ ప్రదేశాల్లో ఫామ్ హౌస్ లో, ఇండ్లల్లో పేకాట, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట చట్ట వ్యతిరేక కార్యకలాపాల సంబంధించిన సమాచారం పోలీసులకు అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.