calender_icon.png 14 January, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు...

13-01-2025 08:49:41 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy)ని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు  తీసుకెళ్లనున్నారు. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్(karimnagar collectorate) లోని జిల్లా సమీక్ష సమావేశం(District review meeting)లో ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.

సమీక్ష సమావేశంలో జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడేందుకు సిద్దమవ్వగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయనకు మైక్ ఇవ్వొద్దని అడ్డుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తనకు మైక్‌ ఎందుకు ఇవ్వొద్దని ప్రశ్నించారు. నీది ఏ పార్టీ అని పాడి కౌశిక్‌రెడ్డి సంజయ్ పై దుర్భాషలాడి ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని జిల్లా సమీక్ష సమావేశం నుంచి బయటకు పంపించారు. ఎమ్మెల్యే సంజయ్ కి ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఈ తోపులాట మంత్రులు ఉత్తమ్ కుమార్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలోనే వాగ్వాదం జరగడంతో హట్ టాపిక్ గా మారింది. కౌశిక్‌రెడ్డి తీరుపై మంత్రి శ్రీధర్‌ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.