హైదరాబాద్ : గత కొన్నిరోజులుగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు నిరసనాలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు పర్మినెంట్ వీసీలను నియామకం, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తార్నాకలో కోదండరామ్ ఇంటి ముట్టడికి నిరుద్యోగ విద్యార్థులు పిలుపునిచ్చారు.
వీసీల పదవీ కాలం ముగియడంతో రెండు నెలలు గడుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు కోదండరామ్ ఇంటి ముట్టడికి పిలుపునివడంతో ముందస్తుగా ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కోదండరామ్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.