12-04-2025 11:18:23 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలో ఓల్డ్ ఏరియా స్టోర్ లో దొంగతననికి పాల్పడిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మందమర్రి సీఐ శశిదర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే గత రెండు రోజుల క్రితం ఏరియా ఓల్డ్ స్టోర్ సింగరేణి అనుబంధ సంస్థ అయిన నీలిమ ఇండస్ట్రీస్ లో ఇనుప రాడ్లు దొంగతననికి గురైనట్లు శనివారం యజమాని చిటుకూరి మల్లేష్ ఫిర్యాదు చేశారు. ఏరియా ఆసుపత్రి మూలమలుపు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఆటో ట్రాలీ డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వెంబడించగా వాహనంలో అనుమానస్పందంగా ఏడుగురు వ్యక్తులు ఉండగా వారిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 60 ఇనుప రాడ్లును గుర్తించి స్టేషన్ కి తీసుకు వెళ్లి విచారించగా నీలిమ ఇండస్ట్రీస్ లో దొంగిలించినట్లు ఒప్పుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జంగు, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.