04-03-2025 01:04:23 PM
ప్రజా ప్రభుత్వంలో ప్రశ్నించే హక్కు లేదా
సిఐటియు నాయకులు, అంగన్వాడి కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
మహబూబ్ నగర్, (విజయక్రాంతి): మా సమస్యలు చెప్పుకుంటాం... మా కడుపు నిండట్లేదు.. ఏంట తరబడి సమాజ అభివృద్ధి కోసం సహాయ శక్తులుగా కృషి చేస్తున్న మా ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని అంగన్వాడీ టీచర్లు అనుమతి తీసుకుని హైదరాబాద్ కు బయలుదేరెందుకు ప్రయత్నం చేస్తున్న అంగన్వాడి టీచర్లను ఇంటి బయటికి రాకుండా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి(CITU District Secretary Nallavelli Kurumurthy)ని ,జిల్లా సహాయ కార్యదర్శి సత్యయ్య అసహనం వ్యక్తం చేశారు.
మంగళవారం రోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడి డైరెక్టర్ ను కలవడానికి అంగన్వాడీ యూనియన్ రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో కలవడానికి ప్రభుత్వ అనుమతితోనే వెళ్తుండగా , టీచర్లను, హెల్పర్లను జిల్లాలో వివిధ మండలాల్లో , అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు సరోజ, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్, ప్రవీణ్ అరెస్టు చేశారని, మండలాల్లోను అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు ప్రకటించారు.
తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల వేతనాలు పెంచాలని, మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీలుగా పోస్టింగులు ఇచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్న వారికి జీతాలు చెల్లించలేదని వాపోయారు. అంగన్వాడి వ్యవస్థను పూర్తిస్థాయిలో పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మనసులలో ఆవేదన ఉన్న అంగన్వాడి టీచర్లు కు ప్రభుత్వం బరస కల్పించేలా చర్యలు తీసుకోవాలని అప్పటివరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఈ నిరసనలలో అంగన్వాడి టీచర్లు, సిఐటి నాయకులు, అంగన్వాడి హెల్పర్లు తదితరులు ఉన్నారు.