calender_icon.png 18 April, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృత్తి నిబద్ధతతో పనిచేస్తేనే పోలీసులకు గుర్తింపు

15-04-2025 08:16:28 PM

మానుకోట ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): పోలీసు వ్యవస్థపై విశ్వాసం పెంపొందించడానికి ప్రతి అధికారి తన విధులను నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించాలని పోలీసులను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ సూచించారు. కోర్టు డ్యూటీ అధికారులతో వివిధ కేసులపై ఎస్పీ జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం అంగీకరించదగ్గది కాదన్నారు. ప్రతి కేసు విచారణలో చార్జ్ షీట్లను నిర్దేశిత కాల వ్యవధిలో న్యాయస్థానాలకు సమర్పించాలన్నారు. కోర్టు విచారణకు సంబంధించి సాక్షుల హాజరును నిర్ధారించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయాన్ని మెరుగుపరుచుకుని కేసుల పరిష్కారాన్ని వేగంగా జరిగేలా కృషి చేయాలన్నారు. భద్రత లోపాలు లేకుండా అన్ని కేసుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టు డ్యూటీలో ఉన్న సిబ్బంది అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు.