ప్రారంభించిన ఆదిలాబాద్ కలెక్టర్
ఆదిలాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా పోలీస్ వార్షిక క్రీడా పోటీలను గురువారం స్థానిక పోలీస్ హెడ్ కార్టర్స్ పరేడ్ మైదానంలో ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి కలెక్టర్ రాజరిషా ప్రారంభించారు. రిజర్ ఇన్‌స్పెక్టర్ వెంకటి ఆధర్యంలో జిల్లాలో ఐదు బృందాలుగా ఉన్న డీఎఆర్ ఈగల్స్, క్యూఆర్టీ విక్టర్స్, ఆదిలాబాద్ స్ట్రుకర్స్, ఉట్నూర్ ఛాలెంజర్స్, హెచ్ జి హంటర్స్ పరేడ్ నిరహించాయి. మూడు రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడా పోటీలతోనే ప్రతి ఒక్కరి ప్రతిభ తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్రావు, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్‌రెడ్డి, హసిబిల్లా పాల్గొన్నారు.