calender_icon.png 28 February, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాధ శవానికి అంత్యక్రియలు జరిపిన పోలీసులు, మున్సిపల్ సిబ్బంది

27-02-2025 09:35:52 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఓ అనాధ శవానికి అంత్యక్రియలు జరిపి బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి పట్టణం కాల్ టాక్స్ ఏరియాలో గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటూ రోడ్లపై నిద్రిస్తూ పల్లపు రాజు అనే వ్యక్తి జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం రామకృష్ణ థియేటర్ ఎదురుగా రోడ్డుపై రాజు పడిపోయి ఉండడంతో అక్కడే ఉంటున్న ఒక మహిళ గమనించి 100కు డయల్ చేశారు. స్పందించిన బెల్లంపల్లి టూ టౌన్ కానిస్టేబుల్ సిహెచ్ రాజీవ్ రతన్, హోంగార్డ్ సంపత్  ఘటన స్థలానికి చేరుకొని రాజు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. రాజుకు సంబంధిత వ్యక్తులు ఎవరు లేకపోవడంతో మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. రాజు మృతదేహానికి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంప్రదాయబద్ధంగా అంతక్రియలు జరిపి మానవత్వం చాటుకున్నారు.