మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
పక్కా పథకం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ నేతుల పోలీసులతో కలిసి దాడులకు పాల్పడ్డారని మాజీ ఎమ్మె ల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు. ఒకవైపు అబిడ్స్ నుంచి, మరోవైపు గాంధీభవన్ నుంచి వందమందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్దకు దూసుకువస్తుం టే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ వెంట ఇనుపరాడ్లు, రాళ్లు తీసుకువచ్చారన్నారు.దాడిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనం ద్ గౌడ్, కార్యకర్త నందు గాయాలపాలయ్యారన్నారు.