22-03-2025 01:25:44 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21 (విజ యక్రాంతి) : బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులకు నోటీసులు పంపేందుకు మాదాపూర్ డీసీపీ వినిత్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ కేసులో సెలబ్రిటీలు ఉన్నందున లీగల్ అంశాలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బెట్టింగ్ యాప్‌ల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డవారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
వారు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన బెట్టింగ్ యాప్‌లను గుర్తిం చే పనిలో పోలీసులున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 15మంది ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు, వారు చనిపోయినప్పుడు నమోదైన కేసుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యలకు కారణమైన యాప్‌ల గుర్తింపు..
బెట్టింగ్ యాప్‌ల వల్ల నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డ వారు ఏ యాప్‌ల కారణంగా చనిపోయారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు కోల్పోయిన వారి వివ కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, వాటిని ప్రమోట్ చేసిన వారిని పోలీసులు నిందితులుగా చేర్చే అవకాశం ఉంది.
కాగా బెట్టింగ్ యాప్‌లపై పోలీసులు కేసులు నమోదుచేసిన సందర్భంగా ఆ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకున్న పలువురు బాధితులు కూడా ముందుకు వస్తున్నారు. శుక్రవారం నెల్లూరుకు చెందిన ఓ బాధితుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. మరింతమంది బాధితులు వచ్చే అవకాశముంది.
కాగా బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్స్ చేసిన కారణంగా మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 19న సినీ నటులు దగ్గుబాటి రాణా, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్యనాగళ్లతో పాటు మరో 18మందిపై కేసు నమోదు కాగా ఈ నెల 17న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యాంకర్ విష్ణుప్రియ, నటి రీతూచౌదరితో పాటు మరో 9మందిపై కేసులు నమోదైన విష తెలిసిందే.
25న మరోసారి విచారణ
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఇప్పటికే 11మందికి సమాచా వారిలో ఇప్పటికే టేస్టీతేజ, కానిస్టేబు కిరణ్‌గౌడ్, విష్ణుప్రియ, రీతూచౌ పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా ఈనెల 25న మరోసారి వారు విచారణకు హాజరయ్యే అవకా ఫౌ తెలుస్తోంది.
ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
అంతర్జాతీయ ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. మధురానగర్ పీఎస్ పరిధిలోని శ్రీదివ్య ఎన్‌క్లేవ్‌లో ఓ ఇంటిని కిరాయికి తీసుకొని బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న సిర్ఫూర్ కాగజ్‌నగర్‌కు చెందిన సోనులె శ్రీకాంత్, గుర్లే హరీశ్, గుర్ల్లే సతీష్‌కుమార్, సోనులె తిరుపతి, ఆడె వినోద్‌లను అదుపులో తీసుకున్నారు.
ఈ పాడు సంపాదన దేనికి: సీపీఐ నారాయణ
ప్రజలు సినీ నటీనటులను అనుసరిస్తారని.. వాళ్లు ఆ విషయాన్ని గమనించి మెదులుకుంటే మంచిందని సీపీఐ నారాయణ హితవు పలికారు. కళామతల్లి ఇచ్చే గుర్తింపును బెట్టింగ్ ప్రచారం వంటి తప్పుడు పనులకు దుర్వినియోగం చేయొద్దని సూచించారు.
యాంకర్ శ్యామలకు నోటీసులు ఇచ్చి విచారించండి: హైకోర్టు
బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి టీవీ యాంకర్ శ్యామలపై నమోదు చేసిన కేసులో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించాలని శ్యామలను ఆదేశిం బెట్టింగ్ యాప్‌లో ప్రమోషన్ చేశారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ యాంకర్ శ్యామలారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.
జస్టిస్ ఎన్ తుకా రాంజీ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారు వినయ్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నారు. తప్పుడు కేసు పెట్టారని, ఆంధ్ర365 యాప్‌తో ఎలాంటి సంబంధంలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎఫ్‌ఐఆర్‌పై స్టే ఇవ్వడానికి నిరాకరించారు.
అయితే కేసును చట్టప్రకారం దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. విచారణకు సహకరించాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణ మూసివేశారు. ఇదే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మహమ్మద్ ఇమ్రాన్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.