calender_icon.png 4 April, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

04-04-2025 12:05:13 AM

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి టౌన్ ఏప్రిల్ 3: వనపర్తి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ ను శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు ‘30 పోలీస్ ఆక్ట్‘ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. 30 పోలీస్ ఆక్ట్ ఈ నెల, ఏప్రిల్ 01 నుండి 30 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు,సమావేశాలు,ఊరేగింపులు, ధర్నాలు,ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు,బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు.

అనుమతులు లేకుండ పై కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం శిక్ష అర్హులవుతారని తెలిపారు.నిషేధంలో ఉన్న నిబంధనలు తప్పనిసరిగా అందరూ పాటించాలని ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తు దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాలని ఎస్పీ కోరారు.