calender_icon.png 15 March, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాను అణ్వాయుధాలు కోరిన పోలాండ్

14-03-2025 11:35:56 PM

నిరాకరించిన డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా పశ్చిమ యూరప్‌లో భద్రపరిచిన అమెరికన్ అణ్వాయుధాలను పోలాండ్‌లో మోహరింపజేయవచ్చంటూ ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ డ్యుడా ఇటీవల ఓ సమావేశంలో ఆహ్వానించారు. అయితే.. ఆ ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నో చెప్పారని తెలిసింది. ఈ విషయాన్ని తాజాగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఓ సమావేశంలో వెల్లడించారు. గతంలో జోబైడెన్ ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు ఇచ్చి  రష్యా ఉక్రెయిన్‌లో రక్తపుటేరులు పారించారని మండిపడ్డారు. కానీ.. ట్రంప్ మాత్రం అలా ఆలోచించడం లేదని, ఉక్రెయిన్‌కు ఏం కావాలి? రష్యా కూడా ఉక్రెయిన్ నుంచి ఏం కోరుకుంటున్నది? అనే అంశాలను పరిశీలిస్తున్నారని స్పష్టం చేశారు. మరోవైపు పోలాండ్ గతంలో కూడా ఇలాంటి ప్రతిపాదన చేయగా, ఆ ప్రతిపాదనను నాటి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తోసిపుచ్చారు.