మంచిర్యాల, (విజయక్రాంతి): పొలాల అమావాస్య పండుగను పురస్కరించుకొని సెప్టెంబర్ 2 నుండి మూడు రోజులు ప్రభుత్వం సెలవు దినలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేతకని రాష్ట్ర అధికార ప్రతినిధి గోళ్ళ రాజమల్లు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ రాజేశ్వర్ కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోళ్ళ రాజమల్లు, అనపర్తి యువరాజ్ లు మాట్లాడుతూ... పొలాల అమావాస్య పండగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటామని, స్వర్గస్థులైన పూర్వీకులకు, గోవులకు భక్తి, శ్రద్ధలతో పూజలు చేసుకుంటామని తెలిపారు. అందుకే నేతకాని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని, ప్రభుత్వం తమ మనోభావాలను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెమెరా అనూష, కొండగొర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.