14-03-2025 10:17:15 PM
పోలీసుల దాడిలో రూ 84,180 నగదు స్వాధీనం
కొండపాక: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుడు ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతుండగా పోలీసులకు పట్టుబడటం పట్టుబడటం చర్చనియంశంగా మారింది. కొండపాక మండలం దుద్దెడ శివారులోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ భర్తకు చెందిన ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో అనంతల నరేందర్, వసూరి లింగం, మంతపురి మహేష్, వసూరి సురేందర్, ఐనకౌల్లలు వీరనారాయణ, మెరుగు శ్రీనివాస్, బూరుగు ప్రేమ్ కుమార్, రైలాపూర్ రవీందర్ రెడ్డి, నర దేశయ్ రెడ్డి, ఆరుట్ల సంపత్, తన్నీరు శ్రీనివాస్, పట్టుబడ్డారు. వీరి వద్ద రూ 84180 నగదు తో పాటు,11 సెల్ ఫోన్లు,5 బైకులు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్, పోలీసు లు మాట్లాడుతూ ప్రజలకు ఆదర్శంగా ఉండే నాయకులే జూదం ఆడటం నేరమన్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు అన్నారు. ఇలాంటి సంఘటనలు గ్రహించిన వారు టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయని తెలిపారు.