calender_icon.png 3 February, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషపూరిత కోనో కార్పస్ చెట్లను తొలగించాలి

03-02-2025 07:38:32 PM

ఎంపీడీవోకు వినతిపత్రం అందించిన ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాలలో, పాఠశాలల పరిధిలో ఉన్న విషపూరితమైన కోనో కార్పస్, బ్లాక్ బోర్డ్ డెవిల్ (ఏడు ఆకుల) చెట్లను తొలగించాలని ఐక్య విజయ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ రేగుంట క్రాంతి కుమార్ లు మాట్లాడారు. ప్రజలకు విద్యార్థులకు గాలి ద్వారా హానికరమైన వాయువులను వెదజల్లే కోనో కార్పస్, బ్లాక్ ఏడు ఆకుల చెట్లను మండలంలో, మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో పెద్ద ఎత్తున పెంచడం జరిగిందని, ఈ చెట్ల నుండి విడుదలయ్యే గాలి ప్రజల ఊపిరితిత్తులకు ప్రమాదకరమైందని ఇప్పటికే ఈ చెట్లను చాలా ప్రాంతాల్లో నిషేధించడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కొనో కార్పస్, బ్లాక్ బోర్డు డెవిల్ చెట్లను వెంటనే తొలగించేలా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు, పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు.