పెరుగుతున్న రోగుల సంఖ్య
ప్రై"వేట్" ఆస్పత్రుల దోపిడీ
జగిత్యాల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలోని ఆసుపత్రుల్లో అనారోగ్యంతో జనాలు విలవిలలాడుతున్నారు. విష జ్వరాలు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ప్రై"వేట్" ఆస్పత్రుల దోపిడీ ఆగకుండా కొనసాగుతుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్ పెల్లి, ధర్మపురి పట్టణాలతోపాటు, వివిధ మండలాలు, గ్రామాల్లో జ్వర బాధితులే కనిపిస్తున్నారు. జ్వరాలు, జనాల్ని పట్టి పీడిస్తున్నాయి. నెలరోజులుగా జిల్లాలో అనేక ప్రాంతాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
దీంతో వివిధ పట్టణాల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడి పోతున్నాయి. మరోవైపు డెంగ్యూ ఫీవర్ పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు బాధితులను నిలువు దోపిడి చేస్తున్నాయి. ప్రభుత్వం ఆసుపత్రి సిబ్బంది ఫీవర్ లపై జనాలకు అవగాహన కల్పించ కపోవడంతోపాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయకపోవ డంతో జనాల నుంచి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఇంటిలోనూ ఎక్కువ సంఖ్యలో జ్వర పీడీతులు ఉండడంవారు తక్కువ ఖర్చుతో ఆర్ఎంపి, పిఎంపీలతో వైద్యం చేయించు కోవడానికి ముగ్గు చూపుతు న్నారు. వారు సొంతంగా మెడికల్ షాప్ లకు వెళ్లి మందులు తీసుకోవడం లేదా ఆర్ఎంపి, పిఎంపీల వైద్యం చేయించు కుంటున్నారు.
జిల్లాలోని కొద్ది రోజుల నుంచి జ్వర బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వైరల్ ఫీవర్ బారిన పడిన రోగాలు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ,ప్రైవేటు ఆసుపత్రి, మెడికల్, ల్యాబ్ లకు క్యూ కడుతున్నారు. రక్త పరీక్షల్లో డెంగ్యూ పాజిటివ్, ప్లేట్లెట్ పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొంత మంది మందులు రాయించుకుని ఇంటికి వెళుతుండగా ,పరిస్థితి తీవ్రంగా ఉన్న రోగులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కన్నా ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ మొగ్గు చూపుతు న్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పిహెచ్ సీ, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలున్న జ్వార బాధితులకు సరైన వైద్యం అందడం లేదు. జిల్లా ఆసుపత్రికి జ్వరాల బాధితుల రెఫర్ చేస్తుండడంతో పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
దీంతో ప్రైవేట్ ఆసుపత్రులన్ని జ్వర పీడుతులతో కిక్కిరిసికి పోతున్నాయి. ప్రధానంగా డెంగ్యూ లక్షణాలతో వస్తున్న వారు అధికంగా ఉంటున్నారు.. తర్వాత స్థానంలో సీజనల్ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ కేసులు ఉంటున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు చెబుతున్న లెక్కలకు ఆసుపత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య ఎక్కడా పొంతన కుదరడంలేదు..
నిత్యం పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రులలో చేరుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో జ్వర బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ఫీవర్ సర్వే చేపట్టాలని జనాలు కోరుతున్నారు. ఈ సర్వే జరపకపోవడం వల్ల ముందుగా వ్యాధులను వాటి తీవ్రతను పసిగట్ట లేని పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ,పట్టణ ప్రాంతంలో సీజనల్ వ్యాధులకు గురి అవుతున్న వారి సంఖ్యను అంచనా వేయాలని ప్రజలు వైద్యశాఖ అధికారులకు కోరుతున్నారు.
ప్రైవేట్ ఆసుపత్రి ఇష్టారాజ్యం
జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో సేవలు ఫీజులు, వసూలు పై వైద్య ఆరోగ్యశాఖ నిఘా కరువైంది.. నామమాత్రపు అనుమతి తీసుకుని ఆసుపత్రులు, నడుపుతున్నా తనిఖీలు లేవు.. డెంగ్యూ, మలేరియా ,టైఫాయిడ్, రకరకాల వ్యాధుల పేర్లు చెప్పి పరీక్షలకు ,చికిత్స, మందులకు, రోగుల నుండి భారీగా ఫీజు వసూలు చేస్తున్నా చర్యలు లేవు. ఈ ఆస్పత్రులను తనిఖీలు చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆ శాఖలోని కొంత మంది అధికారులు ఉద్యోగులు సహకరించడంతో యదార్ధంగా ప్రైవేట్ ఆస్పత్రిలో ఈతరం తతంగం కొనసాగుతుంది.
జిల్లాలో 200 లకు పైగానే ఆసుపత్రులు
జిల్లాలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్,ఆసుపత్రిలు , క్లినిక్ డయాగ్నస్టిక్స్ ,స్కానింగ్ కేంద్రాలు 200కు పైగా ఉన్నాయి. వీరిలో కొంతమంది తాత్కాలిక, శాశ్వత అనుమతులు తీసుకుని నడిపిస్తున్నారు. కాని సీజనల్ వ్యాధులు మొదలైనప్పటి నుండి జిల్లాలోని కొన్ని ఆసుపత్రులు తీరే మారింది. జిల్లాలో జ్వరం తీవ్రత పెరగడంతో చాలామంది మొదట ఆసుపత్రులకు వచ్చేందుకు జంకీనా,ప్రస్తుతం జ్వరం తీవ్రత పెరగడంతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో ఎక్కువ మందికి చేరుతున్నారు. డెంగ్యూ చెప్పి ఆసుపత్రిలో చేరితే అవసరం ఉన్న లేకున్నా రక్తం ,మూత్రం పరీక్షల తోపాటు స్కానింగ్ చేస్తున్నారు. వీటికి గతంలో ఉన్న ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తున్నారు.. ఎవరైనా రోగి బంధువులు అడుగుతే డెంగ్యూ ప్రభావం ఎక్కవ ఉందని విషయాన్ని వివరిస్తూ, రోగుల నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో తాము ఏ ఏ సేవలు అందిస్తున్నారో వాటి వివరాలు తోపాటు వసూలు చేస్తున్న ఫీజు వివరాలు ఆసుపత్రి రోగులకు కనిపించే విధంగా పెట్టాలని నిబంధనలు ఉన్నకొన్ని ఆస్పత్రులు మినహా ఏ ఆసుపత్రిలో పెట్టడం లేదు. ఫీజు విషయంలో ఎవరైనా రోగి బంధువులు నిలదీస్తే వ్యాధి తగ్గక ముందే వేరే ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని హక్కుమ్ జారీ చేస్తున్నారు.
డెంగ్యూ పేరు చెప్పి ఆస్పత్రులకు వచ్చే వారి నుంచి భారీగా వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని కొన్ని ఆసుపత్రులు ఫీజులు వసూళ్లులపై నిలదీస్తే తమకు ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు.ఈ ప్రైవేట్ ఆస్పత్రిలో చేస్తున్న ఫీజులు వసూళ్ల పై కొంతమంది రోగులు బంధువులు జిల్లా వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం ఉండడం లేదు. ఫిర్యాదులపై తొందర స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.. కనీసం ఆసుపత్రిలో తనఖీ చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి.. కొత్త నర్సింగ్ హోంలు తప్ప మిగతా ఆసుపత్రిలకు పట్టించుకోవడం లేదని.. వైద్య ఆరోగ్యశాఖలోని కొంత మంది ప్రైవేట్ యాజమాన్యంతో ఉన్న ఒప్పందంతో ఆ వైపు చూడడం లేదని ప్రజల నుండి విమర్శలు వెతుతున్నాయి.. జిల్లాలో గత సంవత్సరం నుండి ఏ ఆసుపత్రి పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పరీక్షల పేరుతో పెద్ద ఎత్తున ల్యాబ్ ల దోపిడీ
జిల్లా వ్యాప్తంగా సీజన్ వ్యాధులు పిడిస్తున్నాయి. గత నెల రోజుగా పల్లెలు, పట్టణాల్లో విష జ్వరాలతో పాటు డెంగ్యూ, టైఫాయిడ్,లతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వందల సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కోసం మండల, డివిజన్, కేంద్రాలతో పాటు నగరానికి పరుగులు పెడుతున్నారు. కేసులు నమోదైన అధికార యంత్రాంగం బయట పెట్టడం లేదు. అయితే జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో జ్వరా పీడుతులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రోగ నిర్థారణ కోసం ఏ ఆసుపత్రికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించు కోవాల్సిందేనని అంటున్నారు. వైద్యులు ఇదే అదునుగా ప్రైవేట్ కేంద్రాల నిర్వహకులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు.కమిషన్లుకు లో కక్కుర్తి పడి ఆసుపత్రి వైద్యులు, ఆర్ఎంపి, పిఎంపిలు అనవసరమైన పరీక్షలు చేయిస్తున్నారు. ఆవసరం అయితే వారు రక్తం నమూనా లు తమకు ఆనుకులంగా ఉన్న
ల్యాబ్ కు తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యశాఖ పర్యవేక్షణ నియంత్రణ కోరవడంతో ప్రజలు జేబులకు చిల్లు పడుతుంది. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ నిర్ధారణ పరీక్షల కోసం బాధితుల నుంచి ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు ఒక్కక్కరి నుంచి సుమారు రూ.1200 నుండి1500 వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.. ఆస్పత్రులకు అనుబంధంగా లేని కేంద్రాల్లో తక్కువ మొత్తంలో వసూలు చేస్తుండగా ఆసుపత్రి అనుబంధంగా ల్యాబ్ లు ఉంటే అడిగినంత ఇవ్వల్సి వస్తుందని రోగుల బంధువులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు అధిక ఫీజులు చేస్తున్న ల్యాబ్ నిర్వాహకలపై ఆసుపత్రి లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అన్ని పరీక్షలు టిహబ్ లో అందుబాటులో
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఆన్ని రకల రక్త పరీక్షల నిర్వహణ ఉన్న అందుకు తగినంత ప్రచారం మాత్రం జరగడం లేదు. డెంగ్యూ నిర్థారణ పరీక్షల కోసం రక్త పరీక్షలు సేకరించి టీహబ్ పంపుతున్నారు. కొన్ని సెంటర్లలో, జిల్లా ఆసుపత్రి కేంద్రంలో ల్యాబ్ పంపిస్తున్నారు. వీటిపై అవగాహన, ప్రచారం లేకపోవడంతో రోగులు ప్రవేటు ల్యాబ్ లకు ఆశ్రయించి దోపిడి గురవుతున్నారు.
ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం: జిల్లా వైద్యాధికారి డాక్టర్ సమీయోద్దిన్
జిల్లాలో డెంగ్యూ పేరిట రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సమియోద్దిన్, హెచ్చరించారు. రోగులు ప్రైవేట్ ఆసుపత్రికి ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రికి చేరాలని ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని, అలాగే టిహబ్ లో అన్ని రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు ప్రతి ఆరోగ్య కేంద్రంలో శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తమకు ఫిర్యాదు వస్తే తప్పకుండా అట్టి ఆసుపత్రి పై చర్యలు తీసుకుంటామని,అలాగే నిబంధనలు మేరకు ఫీజు వసూలు చేయలని లేని పక్షణ అట్టి ఆసుపత్రికి సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి హెచ్చరించారు.