calender_icon.png 28 October, 2024 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తినలో విషగాలి

28-10-2024 12:00:00 AM

356 పాయింట్లకు పెరిగిన ఏక్యూఐ

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశ రాజధానిలో వాయు కాలుష్యం కొత్త రికార్డు లు సృష్టిస్తున్నది. ఆదివారం కూడా కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయి కి చేరింది. శనివారం నుంచి ఆదివారం వరకు 24 గంటల్లో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 356 పాయింట్లు నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకర స్థాయి (వెరీ పూర్)ని సూచిస్తున్నది.

కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 400 కూడా దాటిందని అధికారులు తెలిపారు. అలీపూర్ (402), ఆనంద్ విహార్ (406), బావన (404), జహంగీర్‌పూర్ (414), నెహ్రూ నగర్ (408), సోనియా విహార్ (401), వివేక్ విహార్ (404)లో అత్యధిక కాలుష్యం నమోదైంది. మరోవైపు నగరం పక్కనే ఉన్న యమునా నది విషపు నురగలు కక్కుతున్నది. నదిలో చాలా ప్రాంతాల్లో తెల్లటి నురగలు కనిపిస్తున్నాయి.