calender_icon.png 19 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులపై విష ప్రయోగం

17-04-2025 12:00:00 AM

  1. 30 మందికి తప్పిన ముప్పు

నిందితుడి అరెస్టు

ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

ఇచ్చోడ, ఏప్రిల్ 16(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో విద్యా ర్థులపై విష ప్రయోగం ఘటన కలకలం రేపింది. పాఠశాల సిబ్బంది అప్రమత్తతతో 30 మంది విద్యార్థులకు పెను ముప్పు తప్పింది. మండలంలోని ధర్మపురి గ్రామ ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన వంట సామగ్రి, మంచినీటి ట్యాంక్, తదితర చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు చల్లారు.

బుధవారం పాఠశాలలు వచ్చిన హెచ్‌ఎం, సిబ్బంది పలు చోట్ల పురుగుల మందు చల్లి ఉండటాన్ని, వాసనను పసిగట్టారు. దీంతో అప్రమత్తతైన పాఠశాల మొత్తం తనిఖీ చేయగా పురుగుల మందు డబ్బా లభించింది. వెంటనే పాఠశాల మొత్తా న్ని పరిశీలించారు. దీంతో విద్యార్థులు తాగే మంచినీటి ట్యాంకులో సైతం పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు.

అప్రమత్తమై ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ  విద్యా ర్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుం డా వారిని ఇళ్లకు పంపించగా, 30 మంది విద్యార్థులకు ప్రాణహాని తప్పింది. అనంతరం హెచ్‌ఎం పోలీసుల ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ  ప్రారంభించారు. ఎవరైనా కావాలని కుట్ర చేశారా.. ? లేదా ఆకతాయిల పని అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పోలీసుల అదుపులో నిందితుడు

పాఠశాలలో పురుగుల మందు చల్లి, విష ప్రయోగాయానికి ఒడిగట్టిన సోయం కిష్టు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గొండు గూడకు చెందిన సోయం కిష్టు కుటుంబ కలహాలతో మానసికంగా ఇబ్బందులు పడు తున్నాడు. నిర్మల్‌లోని తన సోదరుడి ఇంటి నుంచి తీసుకువచ్చిన పురుగుల మందును స్కూల్‌లోని వంట పాత్రలు ఇతర చోట్ల చల్లి నట్లు, ఒప్పుకున్నాడని ఎస్పీ వెల్లడించారు.