16-04-2025 01:24:50 PM
విద్యార్థులకు తప్పిన పెనుముప్పు..
ఇచ్చోడ,(విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో విద్యార్థులపై విష ప్రయోగం ఘటన కలకలం రేపింది. మండలంలోని ధర్మపురి గ్రామ ప్రభుత్వ పాఠశాల(Dharmapuri Village Government School)లోని మధ్యాహ్న భోజన వంట సామగ్రి, మంచినీటి ట్యాంక్, తదితర చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు చల్లారు. ఐతే బుధవారం పాఠశాలలు వచ్చిన హెచ్.ఎం, సిబ్బంది పలు చోట్ల పురుగుల మందు చల్లి ఉన్నది గమనించారు. అదేవిధంగా పురుగుల మందు డబ్బాను సైతం గుర్తించడంతో విద్యార్థులకు పెనుముప్పు తప్పింది. దింతో హెచ్.ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు.