calender_icon.png 23 April, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలో విషప్రయోగం.. విద్యార్థులకు తప్పిన పెనుప్రమాదం

16-04-2025 11:51:28 AM

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం(Ichoda Mandal) ధర్మపురిలో పాఠశాలలో విషప్రయోగం(Poison experiment) జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో దుండుగులు పురుగులమందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగులమందు చల్లారు. సిబ్బంది గమనించడంతో 30 మది విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలోని విషప్రయోగం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషప్రయోగం ఘటనపై హెచ్ఎం ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.