13-04-2025 01:31:09 AM
కంచ గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షాల కుట్ర
హెచ్‌సీయూలో ఏనుగులున్నాయా?
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాం తి): రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభు త్వానివేనని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దుష్ర్పచారాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
శనివారం గాంధీభవన్‌లో మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్‌పరం కాబోతున్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కాపాడిందని, కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని.. అయినా, కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టితో కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకొని వి షం చిమ్ముతున్నారని మంత్రి మండిపడ్డారు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ వీడియోలు సృష్టించి, సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు వైరల్ చేసి దుష్ర్పచారం చేశారని ఆయన మండిపడ్డా రు. ‘తొమ్మిదేళ్ల క్రితం రాజస్థాన్‌లో చనిపోయిన జింక పిల్లను హెచ్‌సీయూలో చనిపో యినట్టు చూపించారు. హెచ్‌సీయూ పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్టు ఏఐ ద్వారా చూపించారు.
అక్కడ ఏనుగులు ఉన్నాయా?.. సోషల్ మీడియాను ఉపయోగించుకొని మా ప్రభుత్వంపై కుట్రలు చేస్తు న్నారు. విద్యార్థులను ప్రభావితం చేసి, ప్ర భుత్వ పనులను అడ్డుకొని.. హైదరాబాద్‌కు పెట్టబడులు, ఉద్యోగాలు రావొద్దని కుట్రలు చేస్తున్నారు’ అని మంత్రి అన్నారు. కంచ గచ్చిబౌలి భూ ముల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్లు జారీ ప్రక్రియ జరిగిందని తెలిపారు.
అలాగే ఐసీఐసీఐ నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ర్ట ప్రజల సంక్షేమం కోసం.. అతి తక్కువ వడ్డీకే నిధులు సేకరిస్తున్నామని తెలిపారు. దాదాపు 37 సంస్థలు బాండ్ల కొనుగోలు ద్వారా పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వ రం ప్రాజెక్టుకు దాదాపు 11 శాతం వడ్డీకి రు ణాలు తీసుకున్నదని, తమ ప్రభుత్వం 9.3 శాతం వడ్డీకే రుణం తీసుకున్నట్లు చెప్పారు.
రైతుల సంక్షేమం కోసమే
‘రూ. 5,200 కోట్ల భూమిని రూ. 30వే ల కోట్లకు చూపించారని పదేళ్లు మంత్రిగా పనిచేసిన బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి మేం లోను తీసుకోలేదు, అ ది కేవలం మర్చంట్ బ్యాంక్‌గా మాత్రమే వ్య వహరించింది. ఆర్బీఐ, సెబీ తదితర సంబందిత అధీకృత సంస్థల ద్వారా రూ.10 వేల కోట్లు సేకరించాం.
కానీ కేటీఆర్ మాత్రం రూ. 10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. కుంభకోణం జరినట్లు ఆధారాలుంటే ఎందుకు చూపించడం లేదు . సెక్యూరిటీ బ్యూరో ఆప్ ఇండియా అనే సంస్థ ద్వారా చేసిన సర్వే ప్రకారం రూ. 23వేల కోట్ల విలువ వచ్చింది. దీన్ని ఎస్‌ఈబీఐ, ఆర్‌బీఐ కూడా నిర్ధారణ చేసింది.
టీజీ ఐఐసీ మార్కెట్ ఫోర్ సెస్ ద్వారా 37 అంతర్జాతీయ సంస్థలు బాండ్లు కొనుగోలు చేశా యి. బాండ్లు అన్ని పబ్లిక్ డొమైన్‌లో ఉన్నా యి. బాండ్ల ద్వారా సేకరించిన నిధుల నుం చే రుణమాఫికి రూ.2,146 కోట్లు, రైతుభరోసాకు రూ.5,463 కోట్లు, సన్నబియ్యం కోసం రూ. 947 కోట్ల ప్రభు త్వం ఉపయోగించింది’ అని శ్రీధర్‌బాబు తెలిపారు.
మీ హయాంలో చెట్లను తొలగించలేదా?
ప్రభుత్వ కార్యక్రమాల కోసం భూసేకరణ చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, గతంలోని భూసేకరణ నిబంధనల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదని మంత్రి స్పష్టంచేశారు. గత ప్రభుత్వం భూసేకరణ ఎన్నడూ చేయలేదా? ఫార్మా సిటీ కో సం వేల ఎకరాల భూములను బీఆర్‌ఎస్ ప్ర భుత్వం సేకరించలేదా? అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.
హరితహారం పేరుతో రూ.10 వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలో పచ్చదనం ఎందుకు పెరగలేదు? ఎన్ని చెట్లు బతికాయి? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో చె ప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ౧౧౧ జీవో ఎత్తివేసినప్పుడు మీకు పర్యావరణం గుర్తుకురాలేదా? సచివాలయం నిర్మించినప్పుడు 207 పెద్ద చెట్లను తొలగించారని, అందులో ఒక్క చెట్టును కూడా తిరిగి నాటే ప్రయత్నం చేయలేదన్నారు.
కాళేశ్వరం కోసం 8 వేల ఎకరాల అడవులను తొలగించింది వాస్తం కాదా? మరి అప్పుడు పర్యావరణం ఎందు కు గుర్తు రాలేదు? నిబంధనలకు విరుద్ధం గా 2016 నుంచి 2019 వరకు 12.13 లక్షల చెట్లను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వమే లోక్‌సభలో వెల్లడించింది. ఇది నిజం కా దా?’ అని మంత్రి ప్రశ్నించారు.
సబర్మతికి ఒక న్యాయం.. మూసీకి మరో న్యాయమా?
‘సబర్మతి పరివాహక ప్రాంత వాసులకు మేలు జరగాలి అని ఆ నదిని బీజేపీ అభివృద్ధి చేసింది. అదే అభివృద్ధిని హైదరా బాద్ మూసీ విషయంలో బీజేపీ వద్దు అం టోంది’ అని శ్రీధర్‌బాబు అన్నారు. సబర్మతికి ఒక న్యాయం.. మూసీకి మరో న్యాయ మా? అని మంత్రి నిలదీశారు. ‘సబర్మతికి వె ళ్లి విజిట్ చేశాం. సబర్మతిలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు..
మూసీ అభివృద్ధిలో సైత ం అన్ని వర్గాలవారు ఉన్నారు. దురుద్ధేశాలతో అభివృద్ధికి కులాన్ని అపాదించవద్దు. మీడియా ప్రతినిధులను కూడా సబర్మతికి తీసుకుని వెళ్లాలని మీడియా అకాడమీ చైర్మన్‌కి విజ్ఞప్తి చేస్తున్నా. సబర్మతి నది అభివృ ద్ధికి ముందు, అభివృద్ధికి తరువాతి పరిస్థితులను సేకరించండి. మూసీ అభివృద్ధిలో ఇ చ్చే సలహాలు సూచనలు తీసుకుంటాం’ అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
రాజధానిలో ఉంటున్నవారందరికీ నాణ్యమైన జీవ నం అందించాలని, మూసీనదీ పరివాహక ప్రాంతంలో ఉంటున్న వారికి స్వచ్ఛమైన గా లి, వాతావరణం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. నగరంలో నాణ్యమైన జీవనంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని నిర్ణయించామని తెలిపా రు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జనసాంద్రత విపరీతంగా పెరగడంతో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు.
రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారు.. ఉండి తీరుతారు!
ముఖ్యమంత్రి పదవిపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ అర్వింద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారు.. ఉండి తీరుతారు.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు’. సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ.. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నారని శ్రీధర్‌బాబు కితాబిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో అందరూ సమర్థులే అన్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టే నా గురించి అలా అన్నాడేమోనని, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో అంతిమ నిర్ణయం అధిష్ఠానిదేనని శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారంటూ వచ్చిన వార్తలను మంత్రి శ్రీధర్‌బాబు తోసిపుచ్చారు.
ఆమె సచివాలయంలో ఎలాంటి సమీక్ష నిర్వహించలేదన్నారు. మమ్మల్ని కలవడానికే మీనాక్షి నటరాజన్ సచివాలయానికి వచ్చారని, అక్కడికి ఎవైనా రావొచ్చని, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు కూడా సచివాలయానికి వస్తారని అని మంత్రి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అమీర్‌అలీఖాన్, వైశ్య కార్పోరేషన్ చైర్మన్ కాల్వ సుజాత కూడా పాల్గొన్నారు.