calender_icon.png 8 November, 2024 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకుశంలో ప్రబలుతున్న విషజ్వరాలు

31-08-2024 10:08:14 AM

15 రోజులుగా గ్రామం జ్వరాలతో అతలాకుతలం

సమాచారం ఇచ్చిన పట్టించుకోని వైద్య సిబ్బంది 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని అంకుశం గ్రామంలో విషజ్వరాలు తీవ్రస్థాయిలో ప్రభలుతు న్నాయి. గత 15 రోజులుగా గ్రామం జ్వరాలతో అతలాకుతలం అవుతుంది. గ్రామంలోని మాలవాడ, బొంతల గూడెం లలో ఇంటికి ముగ్గురు,నలుగురు జ్వరాలతో మంచం పట్టి కనిపిస్తున్నారు. సర్కారు వైద్యం అందకపోవడంతో జ్వర పీడితులు బెల్లంపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది గ్రామంలోని ఆర్ఎంపి వైద్యులను ఆశ్రయిస్తున్నారు.

15 రోజులుగా గ్రామం మొత్తం జ్వరాలతో తల్లడిల్లుతున్నా అసలు పట్టించుకున్న నాధుడే లేకుండా పోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతక జ్వరాలతో తల్లడిల్లుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. తమ గ్రామంలో పనిచేసిన మహిళా ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎం) బదిలీ అయ్యిందని, ఆమె స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉన్న ఇప్పటివరకు ఏఎన్ఎం నియమించకపోవడంతో గ్రామంలో వైద్యం కరువవుతుందన్నారు.

సంబంధిత జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించి జ్వరాలతో తల్లడిల్లుతున్న అంకుశం గ్రామంలో వెంటనే వైద్య శిభిరం ఏర్పాటు చేయాలని జ్వర పీడితులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు జ్వరాలు ప్రబలిన గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.