calender_icon.png 6 November, 2024 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమానికి ఊపిరిలూదిన కవులు

06-11-2024 12:00:00 AM

తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కాళాకారుల, రయితలు సైతం ఉద్యమబాట పట్టారు. 2011 నుంచి 2014 వరకు జరిగిన ఉద్యమంలో నిర్మల్ కేంద్రంగా తమ రచనలతో ప్రజలను కదిలించారు. సకల జనుల సమ్మె, రైల్‌రోకో, సాగరహారం, తెలంగాణ ధూంధాం లాంటి కార్యక్రమాల్లో పాల్గొని తమవంతు పోరాటం చేశారు. జేఏసీగా ఏర్పడి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టారు.

విద్య వైద్య, ఉపాధి రంగాల్లో వివక్షతను వివరించి ఉద్యమాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో కృష్ణంరాజు, దామేర రాములు, మురళీధర్, ప్రమోద్, శివప్రసాద్, నేరేళ్ల హన్మంతు, సుభాష్‌రావు, బి.వెంకట్ తొడిశెట్టి పరమేశ్వర్, పాటల రాజేశ్వర్ లాంటివాళ్లు యూనియన్‌గా ఏర్పడ్డారు. వీరిలోఎక్కువ మంది వైద్యులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులున్నారు.

ఒకవైపు విధులు నిర్వర్తిస్తూనే, మరోవైపు ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొని కవితలు, పాటలతో ఉద్వమ జ్వాల రగిలించారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు కేసులు పెట్టినా తెలంగాణ కోసం వెనక్కి తగ్గకుండా నిరసన కార్యక్రమాలు చేశారు. నిర్మల్, విజయక్రాంతి

రోడ్లపైనే వైద్యం అందించా

నేను రచయితతోపాటు డాక్టర్‌ను కూడా. తెలంగాణ కోసం జేఏసీగా ఏర్పడి నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట 42 రోజులపాటు సకల జనుల సమ్మె నిర్వహించా. ఉద్యమంలో గాయపడ్డవారికి రోడ్లపైనే వైద్యం అందించా. రచయితగా నాలుగేళ్లలో 100 కార్యక్రమాల్లో పాల్గోని పాటలు పాడా. తెలంగాణ చైతన్య కవితలు వినిపించా. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఆందోళన కార్యక్రమాలు చేశాం. పోలీసులు భయపెట్టినా వెనకడుగు వేయలేదు. 

డాక్టర్ కృష్ణంరాజు, రచయిత

అందరిని సంఘటితం చేసి

50 మందితో ఉద్యమ జేఏసీని ఏర్పాటుచేశా. రాష్ట్ర జేఏసీ ఏ కార్యక్రమం తలపెట్టినా నావంతుగా విజయవంతం చేశా. వృత్తిని వదిలి తెలంగాణ ఏర్పా టు లక్ష్యంగా ఉద్యమ ఆకాంక్షను చాటి చెప్పిన. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అప్పటికప్పుడు పాటలు రాసి నిరసన తెలిపాను. రాష్ట్రం ఏర్పడితే యువతకు ఉద్యోగ ఉపాధి ఆవకాశాలు వస్తాయని, తెలంగాణ కళలు వెలుగులోకి వస్తాయని వివరించా.

నేరేళ్ల హన్మంతు, కవి రచయిత

ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా

ఉపాధ్యాయ వృత్తిలో 30 ఏళ్లు పనిచేసిన. తెలంగాణ సమాజంపై జరుగు తున్న వివక్షతపై పలు రచనలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా. “యువత మేలుకో, తెలంగాణను ఏలుకో, మన బతుకమ్మ ఎటుపాయే, మన బతుకులు ఏమాయే, ఉన్న చదువులకు ఉద్యోగాలు రాకపోయే” లాంటి కవితలతో యువతను కదిలించా. తెలంగాణ సంసృతిపై జరిగిన దాడిని కవితలతో తిప్పికొట్టాను. 

 పత్తి శివప్రసాద్, సీనియర్ కవి