31-03-2025 07:24:28 PM
సినీ రచయిత, దర్శక, నిర్మాత దండనాయకుల సురేష్ కుమార్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కవులు సమాజంలో మార్పు కోసం కృషి చేయాలని సినీ రచయిత దర్శక నిర్మాత నాగబాల సురేష్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో అసిఫాబాద్ కవుల సంగం (ఆకసం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం, ఉగాది పురస్కారాన్ని మంచిర్యాల జిల్లా రాంపూర్ అవాస సరస్వతి శిశుమందిర్ ప్రధానాచార్యులు రావుల రామన్నకు పురస్కారాన్ని అందించి శాలువా జ్ఞాపిక పూలమాలలతో ఆకసం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా విశిష్ట అదితి నాగబాల సురేష్ కుమార్ తాను రచించించిన నిన్ను నీవు తెలుసుకో మానవ తాత్వ్వీక గేయ శతకంలోని కన్ను తెరిస్తే కలల బ్రాంతులు కనులు మూస్తే కమలకాంతులు జీవితమంటే కదనరణము జీవనమంటే కిరణసంగమము అనే పద్య కవితను వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అవధాని సలహా దారులు మాడుగుల నారాయణ మూర్తి, గుర్రాల వెంకటేశ్వర్లు ధర్మపురి వెంకటేశ్వర్లు సమాజం సాహిత్యం అనే అంశంపై ప్రసంగించారు.
అనంతరం కవి కవి సమ్మేళనంలో ఆకసం అధ్యక్షుడు నల్లగొండ రమేష్, కార్యదర్శి శ్రీరామ్ సత్యనారాయణ, మడిశెట్టి శ్రీనివాస్, చిలుకూరి రాధాకృష్ణ చారి, దేవరాజ్ రేవతి, కచం సరిత, శ్రీదేవి జ్యోతి కవితలు ఆహుతులను అలరించాయి. వాసవి క్లబ్ అధ్యక్షుడు పాత శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు రావుల శంకర్, వాసవి ఇంటర్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఏకీరాల శ్రీనివాస్ గంధం శ్రీనివాస్, రావుల మురళి లు కవులను పూలమాల శాలువతో ఘనంగా సత్కరించారు.