calender_icon.png 3 April, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవి సమ్మేళనాలు సాహిత్యాభిరుచిని పెంపొందిస్తాయి

31-03-2025 01:40:31 AM

మాజీ ఎమ్మెల్యే చందర్ రావు

కోదాడ మార్చి 30: కవి సమ్మేళనాలు సాహిత్యాభిరుచిని పెంపొందిస్తాయని మాజీ ఎమ్మెల్యే  వేనేపల్లి చందర్రావు అన్నారు. ఆదివారం ఉగాది సందర్భంగా కోదాడ శ్రీ గుంటి రఘునాథస్వామి ఆల యంలో ఏర్పాటు చేసిన సంగీత, సాహిత్య ఉగాది కవి సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

కవుల భావాలు కవితల రూపం లో సమాజాన్ని చైతన్య  పరుస్తాయన్నారు. విశ్వావసు నామ సంవత్సరం ప్రజలకు సౌభాగ్యాలు తేవాలన్నారు. సాహితీ వేత్త విశ్రాంత అధ్యాపకులు మంత్రి ప్రగడ భరతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గుడుగుంట్ల రంగయ్య, కవి సమ్మేళన కన్వీనర్ సేకు శ్రీనివాసరావు, కోదాడ రచయితల సంఘం అధ్యక్షులు పుప్పాల కృష్ణమూర్తి, కిట్స్ కళాశాల డైరెక్టర్ సిచ్ నాగార్జున రావు, ఆలయ కమిటీ సభ్యులు వేనెపల్లి శ్రీనివాసరావు, కొమరగిరి రంగారావు,ఆలయ పూజారి నల్లాన్ చక్రవర్తుల రాఘవాచార్యులు, జి ఎల్ పాల్గొన్నారు.