పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
నిజామాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో బీసీ కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఎమ్మెల్సీ కవిత బీసీ జపం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో మంగళవారం జరిగిన నిజామాబాద్ పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగులు నిధులతో ఉన్న తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించాడన్నారు.
రూ.ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై పెను భారాన్ని మోపాడని దుయ్యబట్టారు. వచ్చే నాలుగేళ్లలో బీఆర్‌ఎస్ భూ స్థాపితం అవడం ఖాయమన్నారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు.
అ నిజామాబాద్ ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రానున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ అవినీతి పాలన, దోపిడీ గురిం ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలను మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.