calender_icon.png 17 April, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత్వాధ్యయనం

17-03-2025 12:00:00 AM

కవిత్వాధ్యయనం నవజీవన మార్గం 

అప్పుడప్పుడూ- కళ్లు మిలమిల మొహం కళకళ

ఒక్కోసారి-మనసు విలవిల కన్నీరు జలజల

మరో దఫా- రక్తం సలసల హృదయం కుతకుత

ఇంకోసారి-పెదాలు ముసిముసి నోరు పకపక

ఒక వాక్యం- ప్రకృతి గుసగుస సెలయేటి గలగల

మరో వాక్యం-ఉరుముల ఫెళఫెళ మెరుపుల తళతళ  

ఇంకో వాక్యం- సూర్యుడి భగభగ చూపుల చురచుర

కవిత్వాధ్యయన అనుభూతులు హృదిలో తటతట మదిలో గిరగిర

కవిత్వాధ్యయనం నవజీవన మార్గం ఇదే కావాలి నిత్య స్తోత్రం