04-04-2025 05:39:13 PM
అనంతగిరి: నల్లగొండ సమీపంలోని చెరువుగట్టు శ్రీశ్రీ సోమనాధేశ్వర విజ్ఞాన పీఠం ట్రస్ట్ లో ఈ నెల 6న కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త ఎస్ లింగమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ రామలింగేశ్వర శర్మ గారి సౌజన్యంతో సిలువేరు సాహితీ కళాపీఠం వారిచే నిర్వహించే కవి సమ్మేళనంలో డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, రఘువీర్ ప్రతాప్ తో పాటు ఉభయ రాష్ట్రాల నుండి 70 మంది కవులు హాజరవుతున్నట్లు, తెలిపారు. ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.