calender_icon.png 16 March, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలహాలు లేని ప్రేమను కాలం విడదీస్తే..

16-03-2025 01:52:18 AM

వినయ్‌కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలమేగా కరిగింది’. శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని పొయెటిక్ లవ్ స్టోరీగా శింగర మోహన్ తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఒక ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తోంది. ఫణి, బిందు అనే విద్యార్థులు చిన్నప్పటి నుంచి ప్రేమికులు. కలహాలే లేని ఈ ప్రేమ కథను కాలం విడదీస్తుంది. ఆ జ్ఞాపకాలు వెదుక్కుంటూ ఫణి ప్రయాణం సాగి స్తాడు. ఈ ప్రేమికులు తిరిగి కలిశారా? ఎలా కలిశారు? అనేదే కథాంశం.