హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రచయితలు, కవులు, సాహితీ వేత్తల సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రతినెలా 1వ, 3వ శనివారంలో కవివారం నిర్వహిస్తున్నట్టు అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్.బాలాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనాలు, పుస్తక సమీక్షలు, సాహితీ ప్రసంగాలు, పుస్తకావిష్కరణలు ఉంటాయన్నారు. పుస్తకావిష్కరణ చేసుకోవడానికి ముందుగా కార్యదర్శి అనుమతి పొందాలన్నారు. ఈ కవివారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.