calender_icon.png 14 March, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవయిత్రి మొల్లమాంబ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

13-03-2025 09:49:11 PM

కుమ్మర (శాలివాహన) సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కవయిత్రి మొల్లమాంబ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కామారెడ్డి కుమ్మర (శాలివాహన) సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కుమ్మరి రాములు, డాకురి మోహన్ లు అన్నారు. కవయిత్రి మొల్ల 585 వ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఆమె చిత్రపటానికి కుమ్మర (  శాలివాహన ) సంఘం సభ్యులతో కలిసి పూలమాలు వేసి మొల్లమాంబ సేవాలను స్మరించుకుని కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమ్మరులకు ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ అవకాశాలు కల్పించాలని, కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వారి కులవృత్తిని అభివృద్ధి చేసుకునేందుకు నిధులు విడుదల చేయాలన్నారు. ప్రస్తుతం ముందు ముందు జరగబోయే స్థానిక ఎన్నికలలో కుమ్మరులకు ప్రతి రాజకీయ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసిలకు  స్థానాలను కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సత్తయ్య (  రిటైర్డ్ టీచర్ ), డకురి ప్రవీణ్, కుమ్మరి యాదగిరి, కుమ్మరి కృష్ణ ( టీచర్ ), కుమ్మరి గోపాల్, కుమ్మరి లక్ష్మణ్, కుమ్మరి మధు తదితరులు పాల్గొన్నారు.