calender_icon.png 18 March, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పొదెం వెంకటేశ్వర్లు సేవలు మరువలేనివి

05-03-2025 05:54:34 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని కుంటల్ల, అందుగులగూడెం, మంగలి తండా, ఎర్రాయిగూడెం పాఠశాలలలో సుమారు 30 సంవత్సరాలకు పైగా అనేకమంది విద్యార్థిని విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యనందించి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాద్యాయుడు దివంగత పొదెం వెంకటేశ్వర్లు సేవలు మరువలేనివని బోడు గ్రామంలోని వారి ఇంటి వద్ద తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) టేకులపల్లి మండల అధ్యక్షులు బి.రామరాజు అధ్యక్షత జరిగిన సంతాప సభలో జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు. పోదెం వెంకటేశ్వర్లు అకాల మరణం మండల విద్యాశాఖకు అదేవిధంగా టిపిటిఎఫ్ కు, వారి కుటుంబానికి తీరని లోటని, వారి కుటుంబంలో వారు లేని లోటును ఎవరు పూడ్చలేరని అన్నారు.

వారి కుటుంబానికి ప్రభుత్వం నుండి రావలసిన అన్ని రకాల బెనిఫిట్స్ను ఇప్పించుటలో టిపిటిఎఫ్ టేకులపల్లి మండల శాఖ, జిల్లా శాఖ సహకరిస్తుందని అన్నారు. ఈ సంతాప సభలో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పూలమాలతో వారి చిత్రపటానికి నివాళులర్పించి, మౌనం పాటించారు. ఈ సంతాప సభలో టిజి టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, టిపిటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పి.సమ్మయ్య, మండల ఉపాధ్యక్షులు పూనెం నాగేశ్వరరావు, జిల్లా కౌన్సిలర్ వాసం భాస్కరరావు, టీఎస్ ఏటీఎఫ్ జిల్లా నాయకులు పూనెం బాలరాజు, వెంకటేశ్వర్లు సతీమణి సుజాత, కుటుంబ సభ్యులు చంద్రయ్య, శ్రీనివాస్, ముత్తయ్య, ఉపాధ్యాయులు,బంధుమిత్రులు పాల్గొన్నారు.