calender_icon.png 5 January, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

02-01-2025 08:27:19 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఓ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై ఫోక్సో కేసు బుధవారం రాత్రి నమోదు అయ్యింది. బోడు ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని సంపత్ నగర్ పంచాయతీ చెందిన మాలోత్ శివకుమార్ మిట్టపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇంట్లోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడడంతో బాలిక గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో బోడు పోలీస్ స్టేషన్లో నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  శ్రీకాంత్ తెలిపారు.