04-04-2025 09:28:40 AM
హైదరాబాద్: కదులుతున్న ట్రైన్ లో మైనర్ బాలికను లేంగిక వేధింపులకు గురిచేసిన దుండగుడికి సికింద్రాబాద్ పోలీసులు(Secunderabad Police) బుద్ధి చెప్పారు. ట్రైన్ లో బాత్రూమ్ వద్ద దుండగుడు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తన ఫోన్ లో వీడియోలను చిత్రీకరించాడు. రక్సౌల్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలు(Raxaul-Secunderabad Express Train) వెళ్తుండగా కేల్జార్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదుతో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశారు.