05-04-2025 12:53:39 AM
మెదక్,(విజయక్రాంతి): మైనర్ బాలికను ప్రేమించమని వేధించిన ఇద్దరు యువకులపై పోస్కో కేసు నమోదు చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండలంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మక్తభూపతి పూర్ పాఠశాలలో టెన్త్ చివరి పేపర్ పరీక్ష రాసి స్వగ్రామం వెళుతుండగా మండల పరిధిలో ఖాజీ పల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి ప్రేమించమని వేధించగా అమ్మాయి తిరస్కరించి యువకుడు వేధించిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. మెదక్ మండలం కాజీపల్లి చెందిన అనిల్ కుమార్, అతనికి సహకరించిన మరో కారు మెకానిక్ పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.