calender_icon.png 30 March, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రిపై పోక్సో కేసు నమోదు

26-03-2025 10:38:34 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియాకు చెందిన ఆకుదారి సతీష్ 8వ తరగతి చదువుతున్న తన 15 ఏళ్ల కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించగా, అడ్డుకోబోయిన భార్యను చేతులు, కర్రతో కొట్టడంతో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు ఆకుదారి సతీష్ పై పొక్సొ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ... సతీష్ కు అతని భార్యకు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని నిందితుని పెద్ద కూతురు తనకు పుట్టలేదనే అనుమానంతో ఆమెపై ఎప్పుడు కోపంగా ఉండేవాడని తెలిపారు.

బుధవారం ఇంట్లో పోచమ్మ పండుగ చేసుకుందామని బాధితురాలిని మంగళవారం మధ్యాహ్నం హాస్టల్ నుండి తీసుకువచ్చిన సతీష్ బయటకు వెళ్లి మద్యం తాగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అడ్డుకోబోయిన భార్యను నిందితుడు కర్రతో కొట్టాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచినట్లు తెలిపారు. బాధితురాలికి కౌన్సిలింగ్ నిమిత్తం భరోసా సెంటర్ కి పంపించినట్లు తెలిపారు.