calender_icon.png 25 October, 2024 | 1:00 AM

కీచక హెచ్‌ఎం సహా 10 మందిపై పోక్సో కేసు

12-07-2024 12:35:26 AM

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

భవిష్యత్‌పై భయంతో బయటకు చెప్పని తల్లిదండ్రులు

విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం

ఎస్పీ దృష్టికి రావడంతో నిందితుడిపై పోక్సో కేసు

రాజీ కోసం వెళ్లిన మరో ఇద్దరు టీచర్లు, గ్రామ పెద్దలపైనా.. 

కామారెడ్డి, జూలై 11 (విజయక్రాంతి): విద్యార్థులకు దిశానిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చను తెచ్చి పెట్టాడు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల కీచకంగా వ్యవహరించా రు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ పాఠశాలలో ఈ ఘటన వెలుగుచూసింది. గురువారం కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ దృష్టికి రావడంతో విచారించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

అనంతరం ప్రధానోపాధ్యయుడు సహా ౧౦ మంది పై పోక్సో కేసు నమోదు చేశారు. దేశాయిపే ట జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు.. విద్యార్థి నుల పట్ల వెకిలి చేష్టలు, శరీర భాగాలను తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నా డు. ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రుల దృష్టికి రావడంతో వెలుగులోకి వచ్చింది. బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఎవరిరకీ చెప్పుకోలేక మనోవేదన అనుభవించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా తెరవెనుక కిందిస్థాయి పోలీస్ సిబ్బంది, విద్యాశాఖ అధికారి చక్రం తిప్పినట్టు తెలుస్తుంది. బాధిత బాలికలకు బాసట గా నిలవాల్సిన మండల విద్యాశాఖాధికారి.. ప్రధానోపాధ్యాయుడు నుంచి నష్టపరిహా రం ఇప్పిస్తానని హమీ ఇచ్చినట్టు గ్రామస్థులు పేర్కొన్నారు. 

మధ్యవర్తుల పైనా..

మధ్యవర్తులుగా ఇద్దరు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కలిసి రాజీ కుదుర్చేందుకు యత్నించారు. విషయం తన దృష్టికి రావడంతో స్థానిక పోలీస్ అధికారి ఎస్పీ సింధుశ ర్మ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఘటనపై విచారణ చేసి బాధ్యులపై పోక్సో కేసు నమో దు చేయాలని గురువారం ఎస్పీ ఆదేశించారు. ప్రదానోపాధ్యాయుడితోపాటు రాజీ కుదుర్చేందుకు వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మొత్తం ౧౦ మందిపై పోక్సో కేసు నమోదు చేశారు.