19-09-2024 12:39:25 AM
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 18: ప్రముఖ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ ఇటీవల రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది. అక్కడి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు బుధవారం జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. తాను మైనర్‌గా ఉన్న సమయంలోనే ఓ హోటల్‌లో జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆరోపించింది.
పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు మరోసారి బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. పోలీసులు నిందితుడికి నోటీసులు ఇచ్చేందుకు యత్నించగా పోలీసులకు ఆయన అందుబాటులోకి రాలేదని, ఆయన మొబైల్ కూడా కనెక్ట్ కావడం లేదని సమాచారం. అతడిని పట్టుకునేందుకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు.
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు..
మహిళను లైంగికంగా వేధించిన జానీ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నగరానికి చెందిన పలు మహిళా సంఘాల నేతలు, సభ్యులు బుధవారం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్‌పర్సన్ శారద స్పందిస్తూ.. బాధితురాలకు కమిషన్ అండగా ఉంటుందని ప్రకటిం చారు. ఇప్ప టికే ఆమెకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆదే శించామన్నారు. మరోవైపు నిందితుడు లవ్ జిహాద్‌లో భాగంగా మహిళను లైంగికంగా వేధించాడని బీజేపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆరోపించారు. బాధితురాలిని మతం మార్చు కోవాలని ఒత్తిడి చేశాడరని అభ్యంతరం వ్యక్తం చేశారు. లవ్ జిహాద్‌కు పాల్పడ్డాడని అన్నారు.