calender_icon.png 7 January, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో

06-01-2025 12:11:40 AM

  • విద్యార్థినులపై లైంగిక వేధింపులు
  • కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ నవోదయ పాఠశాలలో ఘటన

కామారెడ్డి, డిసెంబర్ 5 (విజయక్రాంతి): విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదైన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లోని నవోదయ విద్యాలయంలో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడటంతో విద్యార్థినులు తల్లితండ్రులకు చెప్పి, నిజాంసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది. పోక్సో కేసు నమోదైన ఉపాధ్యాయుల వివరాలు పోలీసులు వెల్లడించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నది. తమ పరిధిలో లదేంటూ నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలుపడం గమనార్హం.

కాగా ఇంతకు ముందుకూడా నవోదయ విద్యాలయంలో విద్యార్థినుల పట్ల మూడుసార్లు అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థినులు వైస్ ప్రిన్సిపాల్ దృష్టికి  తీసుకెళ్లినప్పటికీ బయటకు పొక్కకుండా వైస్ ప్రిన్సిపాల్ జాగ్రత్త పడ్డట్లు తెలుస్తున్నది. లైంగిక వేధింపుల విషయం బయటకు పొక్కకుండా ఉంచిన వైస్ ప్రిన్సిపాల్‌పై కూడా కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వైస్ ప్రిన్సిపాల్ విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.