calender_icon.png 18 January, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏక్తాకపూర్‌పై పోక్సో కేసు

21-10-2024 12:26:56 AM

ముంబై, అక్టోబర్ 20: బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ చిక్కుల్లో పడిం ది. ప్రముఖ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఆమెపై పోక్సో కేసు నమోదైం ది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో ప్రసారమవుతోన్న గంధీబాత్ సీజన్ సంబంధించి ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిరీస్‌లో మైనర్ బాలికలకు సం బంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చూపించారన్న ఆరోపణలతో పోక్సో యాక్టును నమోదు చేశారు.

ఈ కేసులో ఏక్తాతో పాటు ఆమె తల్లి శోభాకపూర్ పేరు కూడా చేర్చారు. గంధీబాత్ సిరీస్‌కు వీరిద్దరు నిర్మాత లు కావడంతో ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో మైనర్లకు సంబంధించి అసభ్యకర సన్నివే శాలున్నాయని పోలీసులకు ఫిర్యా దు రావడంతో ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు.