calender_icon.png 15 March, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోకో ఎం7 5జీ ఫోన్... రూ.9999కే

05-03-2025 06:19:56 PM

షావోమీ అనుబంధ సంస్థ పోకో మరో కొత్త ఫోన్ ను విడుదల చేసింది. తక్కువ ధరకు ఎక్కువ డిమాండ్ చేసే వారి కోసం రూపొందించబడిన పవర్‌హౌస్ ఫోన్ ఎం సిరీస్ లో POCO M7 5Gని ప్రారంభించడంతో మరోసారి బడ్జెట్ విభాగాన్ని షేక్ చేస్తోంది. స్నాప్‌డ్రాగన్ 4 జెనరేషన్ 2 + 12GB RAM భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌తో గేమింగ్, ఎడిటింగ్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ తో పనిచేస్తుంది. ఇలాంటి ఫోన్ కేవలం రూ.9999 లకే తీసురావడం విశేషం. పోక్ ఎం7 5జీ 6.88 అంగుళాలు డిస్‌ప్లేతో పాటు అల్ట్రా-స్మూత్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 600 నిట్స్ ఫీక్ బ్రైట్ నెస్ తో ఈ వస్తోంది. 50 ఎంపీ కెమెరా, సోనీ సెన్సార్ తక్కువ కాంతిలో కూడా క్రిస్ప్, ఇన్‌స్టా-రెడీ షాట్లు, 5160 ఎంఎహెచ్ బ్యాటరీ + 18W ఫాస్ట్ ఛార్జింగ్ (33W ఇన్-బాక్స్ ఛార్జర్). 5జీ, బ్లూటూత్ 5.0, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ -సి పోర్ట్ వంటివి అందుబాటు ఉంటాయి. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ+12 జీబీ వేరియంట్ ధర రూ.9999లు, 8 జీబీ+128జీబీ వేరియంట్ రూ.10,999 గా కంపెనీ ధరను నిర్ణయించింది. ఫ్లిప్ కార్డ్ లో మార్చి 7వ తేదీన నుంచి అందుబాటులో ఉంటుంది. మింట్ గ్రీన్, ఓషన్ బ్లూ, సెటైన్ బ్లాక్ రంగుల్లో వినియోగదారులను ఆకర్షితులను చేస్తుంది.