calender_icon.png 2 November, 2024 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్తలకు పాకెట్ మనీ

28-07-2024 04:11:05 AM

న్యూ ఢిల్లీ, జూలై 27: ప్రపంచంలోని మెజార్టీ దేశాల్లో గతంలో భర్త ఉద్యోగ బాధ్యతను తీసుకుంటే భార్య ఇంటి నిర్వహణ బాధ్యతను తీసుకునేది. పురుషులు ఉద్యోగం చేసి జీతం డబ్బులను ఇంట్లోని ఆడవారికి ఇస్తే వారు పొదుపుగా ఖర్చు చేసి మిగిలింది ఆదా చేసేవారు. అయితే నేటి సమాజంలో భర్త, భార్య ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఒకరికొకరు ఆర్థికంగా తోడుగా ఉంటున్నారు. ఈ రెండిటికి భిన్నంగా జపాన్‌లోని చాలా ప్రాంతాల్లో ఓ వింత సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ భర్తలు సంపాదించే మొత్తం డబ్బులను భార్యల చేతిలో పెడతారు. స్త్రీలు ఆ డబ్బును ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, సేవింగ్స్ వంటి వాటికి ఉపయోగించి వాటిలో నెలనెలా తమ భర్తలకు పాకెట్ మనీ ఇస్తారట.

అయితే ఇందులో కూడా ఒక కండిషన్ ఉంది. భార్య ఎంత పాకెట్ మనీ ఇస్తే భర్త అంతే ఖర్చుచేయాలి. ఈ సాంప్రదాయన్ని ‘కొజుకై’ అని అంటారట. వీరు ఈ సాంప్రదాయాన్ని పాటించడానికి ప్రధాన కారణం.. పురుషులు ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటే స్త్రీలు ఇంటి బాధ్యత తీసుకోవాలి, వేతనం అంతా భార్యకు ఇస్తే ఇద్దరి మధ్య నమ్మకం, పారదర్శకత పెరుగుతుందట. అనవసర ఖర్చులు తగ్గుతాయట. ఈ సాంప్రదాయం గురించి యోషిహిరో నోజువా అనే జపనీస్ వ్యక్తి తెలపగా ఇప్పుడు అది వైరల్‌గా మారింది.