calender_icon.png 29 April, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాండురంగ స్వామిని దర్శించుకున్న పోచారం

29-04-2025 01:13:20 AM

బాన్సువాడ, ఏప్రిల్ 28: మహారాష్ర్టలోని సోలాపూర్ జిల్లాలోనీపండరీపూర్ లో గల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం  రుక్మిణీ పాండురంగ విఠలేశ్వర స్వామి వారి మీ సోమవారం రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహా దారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు. పాండురంగ విటలేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ ప్రతినిధు లు  ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానం చేశారు, అనంతరం మరాఠీ సంప్రదాయంలో  పండరిపూర్ విట్ఠలేశ్వరుని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంట ఆలయ కమిటి ప్రతినిధు లు, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అంజిరెడ్డి కృష్ణారెడ్డి శేఖర్ రెడ్డి తదితర, నాయకులు ఉన్నారు.